ఇదేనా న్యాయం అంటే??

ఆసిడ్ దాడి కేసు లో నిందితులని చంపేసారని చదివాను. దానికి చాలా మంది మద్దత్తు తెలిపారని చదివి ఏడ్వాలో లేక భలే భలే అని చంకలు గుద్దుకోవాలో అర్థం కాని పరిస్తితి. వాళ్ళు చేసినది క్షమించరాని నేరం. వాళ్ళేదొ ఉన్మాదం లో అలా చేస్తే చంపడమే సరి అయిన పని అనే వాళ్ళను, బాగా జరిగింది, న్యాయం జరిగింది అనే వాళ్ళది ఇంకో రకమైన ఉన్మాదమేమో. తప్పు కు తప్పు పరిష్కారమా? ఇలా చేయడం వల్ల ఇక ముందు ఇలాంటి తప్పులు జరగవని ఎవరైనా చెప్పగలరా? ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయో, దాని మూల కారణాలు ఎంటో అర్థం చేసుకోకుండా వుంటే ఎన్ని రొజులైనా జరుగుతూనే వుంటాయి. ఎదో ఒకటి జరిగిన ప్రతి సారి తప్పు ఎవరిది, అమ్మాయి తప్పెంత, అబ్బాయి తప్పెంత, ఎవరి తప్పు శాతం ఎక్కువ వగైరా వగైరా ఇలా సాగుతాయి మన విశ్లేషణలు. అంతే తప్ప సమస్యకు మూల కారణం మీద మాత్రం దృష్టి పెట్టం.

పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ను పెరగనివ్వం. ప్రతిదానికి మనకు సమాజం ఆమోదముద్ర వుండాల్సిందే. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ చదువు అన్నింటిలోనూ వాళ్ళ ఇష్టాలు ఎలాగూ అడగం కనీసం వాళ్ళ మీద రుద్దే అభిప్రాయాలైనా మనవా అంటే కాదు సమాజం ఆమోదించిన వాటినే మనం వాళ్ళ మీద రుద్దుతాం. మనం వాళ్ళను ఇంతలా శాసిస్తూ వుంటే జీవితాన్ని ప్రేమించడం ఎలా నేర్చుకుంటారు.

ఇంక యుక్తవయసుకు వచ్చాక సహజం గా కలిగే ఆకర్షణలని అణచివేయాలని చూస్తాం. ఇది చాలా సహాజమైన విషయం కదా ప్రతి ఒక్కరి జీవితం లో ను జరిగే వుంటుంది కదా. మరి ఎందుకు అర్థం చేసుకోము. ఇలాంటి ఆకర్షణలను ప్రేమ అని పిల్లలు భ్రమ పడడం. ఇలాంటి ఆకర్షణలు ఎంత తొందరగా ఏర్పడతాయో అంతే తొందరగా మారిపోవచ్చు. ఇవన్ని వాళ్ళ జీవితం లో సహజం గా జరిగే మార్పులు అని, తప్పు కాదని చెప్పల్సిన బాధ్యత తల్లిదండులుగా మనదే కదా.మన పిల్లలు మన మాట వినాలి అంటే మనం కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇష్టాలకు విలువ ఇవ్వాలి కదా. సమాజం లో మార్పు రావాలి అంటే కనీసం రేపటి తరానికైనా వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా జీవించే అవకాశం ఇద్దాం.

5 స్పందనలు

  1. ఇలాంటి ఎన్‌కౌంటర్లకి ప్రోత్సాహం లభిస్తే దీని ప్రేరణతో మరింతమంది పోలీసులు రెచ్చిపోయి మరిన్ని ఎన్‌కౌంటర్లకి పాల్పడతారు. అప్పుడు ఆక్రోశించేది మళ్లీ ఈ జనాలే.

  2. అవునండి అబ్రకదబ్ర గారు మీరు చెప్పింది నిజం. సమస్యకు మూలకారణం తెలుసుకొని దాన్ని పరిష్కరించుకోవడం ఇప్పుడు మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అంతే కాని ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోవడం కాదు.

  3. [...] వరంగల్‌లో జరిగిన రెండు దుర్ఘటనలకు బ్లాగులలో చాలా మంది బాగానే స్పందించారు. నా బ్లాగులో వెతకండి మీడియా చేయించిన హత్యలు You oughtta do it స్వప్నికా! అసలు నేరస్తులు ఆటవిక న్యాయం అమలైంది! ఇదేనా న్యాయం అంటే?? [...]

  4. [...] న్యాయమంటే ఇదేనా అని అడుగుతున్నారు స్నేహ [...]

  5. చిరంజీవి కొడుకో, చంద్రబాబు నాయుడు బంధువో ఆ పని చేస్తే పోలీసులు ఎంకౌంటర్ చెయ్య గలరా? ఎంకౌంటర్లలో చచ్చేది సాధారణ ప్రజలే కానీ డబ్బున్న దొంగలు కాదు.

ప్రత్యుత్తరమిమ్ము